లిక్కర్ స్కాం క్లైమాక్స్‌కి చేరింది. నాలుగు నెలలుగా లిక్కర్ స్కాంపై సిట్ విచారణ చేస్తోంది. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏప్రిల్ నుంచి కేసులో నిందితుల అరెస్ట్ మొదలు పెట్టింది. మొదటి కేసులో మిథున్ రెడ్డి కీలకమని సిట్ చెబుతోంది. ఒక సారి నోటీస్ ఇచ్చి మిథున్ రెడ్డిని విచారించింది. కేసులో టెక్నికల్ ఆధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచింది.