టాలీవుడ్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపగా, ఆ వివాదం ఇప్పుడు నటి అనసూయ భరద్వాజ్ వర్సెస్ శివాజీగా మారిపోయింది. తన వయసును, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఉండాలో చెబుతూనే, తనను ‘ఆంటీ’ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తున్న వారికి చురకలు అంటించారు. కొంతమంది పురుషులు, మహిళలు కూడా తన వయసును…