Tariff On India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని చెబుతూ అమెరికా 25 శాతం పరస్పర సుంకాలతో పాటు మరో 25 శాతం శిక్షార్హమైన సుంకాలను విధించింది. మొత్తంగా ట్రంప్ సర్కార్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించింది. అయితే, ఇప్పుడు అమెరికాకు తత్వం బోధపడింది. తాము, సుంకాలతో భారత్‌పై చర్యలు తీసుకున్నా కొద్దీ, రష్యా, చైనాలకు దగ్గర అవుతుందనే భయం అమెరికా పరిపాలనను వెంటాడుతోంది. దీంతో, ఎలాగొలా భారత్‌తో…
Economic Survey 2023 Highlights: ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వే-2023ను ప్రవేశపెట్టారు. ఈ సర్వే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు అద్దం పట్టింది. వివిధ రంగాల గణాంకాలను సవివరంగా పొందుపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా సెక్టార్ల పనితీరును ప్రతిబింబించింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన వివిధ పథకాల గురించి, వాటి వల్ల వచ్చిన ఫలితాల గురించి స్పష్టంగా పేర్కొంది.
Today (01-02-23) Business Headlines: ఇండియాలో యాపిల్ విస్తరణ: యాపిల్ కంపెనీ ఎయిర్‌పాడ్స్ విడి భాగాల తయారీ ఇండియాలో ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీన్నిబట్టి ఈ అమెరికా టెక్నాలజీ జెయింట్.. భారత్‌దేశంలో ప్రొడక్షన్‌ను విస్తరిస్తోందని చెప్పొచ్చు. యాపిల్ కంపెనీకి కీలకమైన సప్లయర్‌గా వ్యవహరిస్తున్న జాబిల్ అనే సంస్థ ఎయిర్‌పాడ్స్ ఎన్‌క్లోజర్లను లేదా ప్లాస్టిక్ పరికరాలను చైనాకి మరియు వియత్నాంకి సరఫరా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.