రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. రెండు రోజులపాటు (మార్చి 1, 2) జరిగిన జాతర ఉత్సవాలు నేడు ముగిశాయి. ఆర్తుల అభయప్రదాతగా విరాజిల్లుతున్న గంగమ్మ దేవత అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గంగమ్మ అమ్మవారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి…