అనంతపురం నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ క్లియర్ కట్ మెజార్టీతో పీఠంపై ఉంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 48 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వారిద్దరు కూడా వైసీపీకి మద్దతు పలికారు. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వసీం సలీంని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అది అప్పట్లో చాలామందికి నచ్చలేదు. పైగా అనంత వెంకటరామిరెడ్డికి మేయర్ వసీంకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు.