కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సమయంలో.. ఆయుర్వేద మందు తయారీ చేసి వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య… ఆయన మందు కొంతకాలం ఆగిపోవడం, కోర్టు వరకు వ్యవహారం వెళ్లడంతో చాలా రోజులు ఆయన వార్తలు ఆసక్తికరంగా మారాయి.. మొత్తానికి ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వడంతో.. మంది పంపిణీ మొదలు పెట్టారాయన. ఈ సమయంలో ఆనందయ్యకు చాలా మంది మద్దతుగా నిలిచారు.. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది ఓ…
ఆనందయ్య మందు పంపిణీపై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు.. ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను ఈ సందర్భంగా కోర్టు తోసిపుచ్చింది.. ఈ వ్యవహారంపై మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది హైకోర్టు.. అయితే, ఆనందయ్య మందుపై ప్రభుత్వం కాసేపట్లో సమీక్ష జరుపుతోందని కోర్టుకి తెలిపారు ప్రభుత్వ న్యాయవాది.. దీంతో.. ప్రభుత్వ సమీక్ష నిర్ణయం తెలపాలని.. మధ్యాహ్నం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.. దీంతో.. విచారణను వాయిదా వేసింది. మరోవైపు.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని…