ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మందు పంపిణీపై ఫోకస్ పెట్టారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో చర్చలు జరిపిన ఆయన.. వనమూలికలు, దినుసులు సేకరించే పనిలో పడిపోయారు.. మరోవైపు.. ఇవాళ మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు.. అయితే, బయట ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు అని…
మందు పంపిణీకి అన్ని పార్టీలు నాకు సహకరించాయి అని ఆనందయ్య అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… మా నాన్న చిన్న రైతు… నేను వ్యాపారం చేసే వాడిని. రియల్ ఎస్టేటు లో తీవ్రంగా నష్ట పోయాను. నాకు మా కుంటుబం సభ్యులు సహకారం ఉంది. ఇప్పటి వరకు లక్ష రూపాయలు నా సోంత డబ్బు ఖర్చు పెట్టాను. తిరుపతిలోను గత ఎడాది 500 మందికి మందు ఇచ్చాను. ఇబ్బంది వేస్తే 15 రోజులు ప్రభుత్వం ఆపింది..…
ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి నిరాకరించింది.. దీంతో.. కంట్లోవేసే చుక్కుల మందుకు కూడా అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు ఆనందయ్య తరపు న్యాయవాది.. ఆ మందుపై నివేదికను గురువారం లోగా అందించాలని హైకోర్టు వ్యాఖ్యానించగా.. కంట్లో వేసే చుక్కులు కె అనే మందును అనుమతించకపోవడానికి శాంపిల్ ఇవ్వకపోవమే కారణంగా చెప్పింది ప్రభుత్వం.. అయితే, ఈ రోజు కె మందు శాంపిల్ ఇస్తామని తెలిపారు ఆనందయ్య…
ఆనందయ్య మందు పంపిణీపై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మందు పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని ప్రశ్నించిన హైకోర్టు.. 4 రోజులు సమయం ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు కోర్టు మందు ఉంచలేదు అని అడిగింది. 15 నిమిషాల్లో ఉత్తర్వులను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. 15 నిమిషాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. అయితే అల్కహాల్ మరియు సిగరేట్…
రేపు ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతులు రావచ్చు అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయుష్ తుది నివేదిక కూడా రేపు ఇస్తారని ఆయుష్ కమిషనర్ రాములు కూడా చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ మందు పై దృష్టి పెట్టారు అని తెలిపారు. ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ప్రజలకు శుభవార్తే వస్తుంది. అనుమతులు లభించాక ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఇక ఆనందయ్యను నిర్బంధించారంటూ టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది అని పేర్కొన్నారు.…
కోరోనా మహమ్మారిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ముగిసింది… నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.. ఆ మందుపై ఆయుష్ కమిషనర్ రాములు వివరాలు తెలియజేశారు.. ఇప్పటికే ఆనందయ్య మందు పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయన్న ఆయన.. రేపు చివరి నివేదిక రానుందన్నారు.. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.. ఇక, కేంద్రం సంస్థ సీసీఆర్ఏ అధ్యయన నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం…
కరోనా కల్లోలం సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేసిన కరోనా మందు.. ఎంతో మందికి నయం చేసిందని చెబుతున్నారు.. అయితే, దీనిపై అధ్యయనం చేసేందుకు మందు పంపిణీని నిలిపివేసింది ప్రభుత్వం.. ఓవైపు దీనిపై అధ్యయనం జరుగుతుండగా.. మరోవైపు.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమతించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది…
ఆనందయ్య మందుని ప్రభుత్వం నిలిపివెయ్యడం సబబు కాదు అని సిపిఐ నారాయణ అన్నారు. ఆనందయ్య ఇప్పటికే 50 వేల మందికి పైగా భాధితులుకు మందుని అందించారు. ప్రజలో ఆనందయ్య మందు పై నమ్మకం ఏర్పడింది. హైదరాబాద్ లో ప్రవైట్ హస్పిటలో 75 లక్షల బిల్లు కట్టించుకోని… శవాని ఇచ్చారు. డాక్టర్లు అందరు దోచుకుంటున్నారని అనను. కానీ ఆలస్యం చెయ్యకుండా ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించాలి అని తెలిపారు. ఆనందయ్యని ఎవరు ఎమి చెయ్యలేరు… ఆయనకు చాలా…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం పనితీరుపై పరిశోధన ప్రారంభించింది జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ. మొదటి దశలో ముందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సీసీఆర్ఏఎస్… విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి బాధ్యతలు అప్పగించింది సీసీఆర్ఏఎస్. నెల్లూరు జిల్లా ఎస్పీ సహకారంతో మందు తీసుకున్న 500 మంది వివరాలు సేకరించిన సీసీఆర్ఏఎస్… వీరి నుంచి అభిప్రాయాలు, వివరాలు తీసుకోనున్నారు ఆయుర్వేద వైద్యులు. కరోనా పరీక్షల రిపోర్ట్, మందు…
ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ప్రస్తుతం నెల్లూరు అధికారుల ఆధీనంలో ఉన్నారు ఆనందయ్య. ఇక నిన్న ఆయూష్ కమిషనర్ రాములు సమక్షంలో మందు తయారు చేసారు ఆనందయ్య. అయితే ఆ మందులో హానికర పదార్థాలు లేవని ఆయూష్ కమిషనర్ పేర్కొన్నారు. కానీ ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్న రాములు… ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా…