నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.. మొదట కృష్ణపట్నంతో ప్రారంభమైన కరోనా ఆయుర్వేద మందు పంపిణీ.. క్రమంగా నెల్లూరు జిల్లా.. పక్క జిల్లాలు.. పక్కా రాష్ట్రాలు.. ఇలా క్రమంగా కరోనా బాధితులు కృష్ణపట్నం బాటపట్టారు.. రోగుల తాకిడి ఎక్కువ కావడంతో.. మందు పంపిణీ కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి విచ్చింది.. అయితే, ఈ వ్యవహారంపై ఆరా తీశారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐసిఎంఆర్ డైరక్టర్ జనరల్ తో మాట్లాడారు వెంకయ్య..…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండడంతో.. ఇప్పుడు వేలాది మంది అటు పరుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు.. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇక, తాను తయారు చేస్తున్న మందులపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులతో మందు తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు పనితీరు.. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు.. దాటేసింది.. దీంతో.. కోవిడ్ మందు కోసం తరలివచ్చినవారితో కృష్ణపట్నం జనసంద్రంగా మారిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా పంపిణీని నిలిపివేశారు. ఇక, ఆయుర్వేద మందు పంపిణీపై స్పందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరు కి చేరుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.. వేల…