ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మందు పంపిణీపై ఫోకస్ పెట్టారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో చర్చలు జరిపిన ఆయన.. వనమూలికలు, దినుసులు సేకరించే పనిలో పడిపోయారు.. మరోవైపు.. ఇవాళ మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు.. అయితే, బయట ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు అని సూచించారు.. మీమీ ప్రాంతాలకే మందు పంపిస్తామని.. ముందుగా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ వచ్చినవారి కోసం 5 వేల ప్యాకెట్ల చొప్పున ఆదివారం లేదా సోమవారం రోజు పంపుతామని వెల్లడించారు.. పాజిటివ్ రిపోర్ట్ చూపించి.. అక్కడే మందు తీసుకోవచ్చు అన్నారు ఆనందయ్య.. ఇప్పటికే అధికారులు మందు పంపిణీకి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఆనందయ్య మందు తీసుకున్నవారికి అందరికీ నయం అయిందనే ప్రచారంతో ఆ మందుపై అందరికీ ఆసక్తి పెరిగింది.. ఆనందయ్య మందు పంపిణీ ఆగిపోవడంతో.. అంతా అసంతృప్తి వ్యక్తం చేశారు.. తిరిగి మందు పంపిణీ కానుడడంతో.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.