ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీలలో ప్రస్తుతం బీజేపీకి గణనీయమైన బలం ఉంది. కాబట్టి పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీకి తిరిగి అధికారం దక్కుతుందో లేదో తెలియదు. ఒకవేళ గెలిచినా ఎన్ని సీట్లు వచ్చాయనేదిముఖ్యం. ఎందుకంటే బొటా బొటి మెజార్టీతో ఆయా రాష్ట్రాలలో అధికారం తిరిగి చేజిక్కించుకుంటే రాజ్యసభలో బీజేపీ బలం తగ్గుతుంది. లోక్‌సభలో పూర్తి మెజార్టీ…
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి భారత్‌లో కొత్తగా 6,358 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 653 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అంటే మొత్తం కేసులలో ఇది దాదాపు పది శాతం. ఒమిక్రాన్ సంక్రమించిన వారిలో 186 మంది కోలుకున్నారు. కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి నుంచీ ముందున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలో ఆ రాష్ట్రమే అదే టాప్. మంగళవారం నాటికి కొత్త వేరియంట్ కేసుల సంఖ్య…
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో దీపావళి రోజున ‘ఆహా’ ఓటీటీలో ఆరంభమయింది. మొదటి రోజునే బాలకృష్ణ ప్రోగ్రామ్ లో గెస్ట్స్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు రావడం విశేషమనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ యాభై నిమిషాలు ఉంది. ఎవడాపుతాడో చూద్దాం… ఆరంభంలో బాలకృష్ణ ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా తన గురించి జనం ఏమనుకుంటున్నారో వివరిస్తూ తెరపై కనిపించడం ఆకట్టుకుంటుంది.…
స్వరరాగ గంగా ప్రవాహమే అని జేసుదాసు పాడితే పరవశించిపోయిన ఈ దేశంలో ఇప్పుడు శవగంగా ప్రవాహం చూశావా రాజా అని ప్రశ్నించే విషాదాన్ని సృష్టించిన వారెవరు? పరవశాన శిరసూగంగా తలకు జారెనా శివగంగ అని శంకరశాస్త్రి గానం చేసిన శివగంగను శవగంగగా మార్చిన వారెవరు? సెకండ్ వేవ్ అనే కరోనా మలిదెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే బలైపోతుంటే ప్రాణవాయువును అందించలేని ఘోర దురవస్థ రావడానికి కారకులెవరు?ప్రపంచానికే వాక్సిన్ అందించే ఔషద రాజధానిగా దేశాన్ని మార్చామని గొప్పు…