సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలడంతో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స్థానిక పరిపాలనతో కలిసి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు అమిత్ షా తెలియజేశారు.