ఏపీ రాజధానిగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలన్నది నాటి సీఎం చంద్రబాబు స్వప్నం. ప్రపంచ ప్రఖ్యాత నగరాలను పరిశీలించి రాజధాని నిర్మాణానికి ప్లాన్ చేశారు. అయితే నిర్మాణం పనులు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కానీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియ మాత్రం మొదలైంది. పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. వాటిలో కొన్ని ముందుకు వచ్చాయి. మరికొన్ని వచ్చే క్రమంలో ఉన్నాయి. ఈ లోగా రాజధాని భూ సేకరణలో అవకతవకల అంశం తెరమీదకు…