నాంపల్లి కోర్టుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి చేరుకున్నారు. సంధ్య థియోటర్ ఘటనలో నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మళ్లీ కోర్టుకు చేరుకున్న ఐకాన్ స్టార్ రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి ష్యూరిటీలు సమర్పించారు. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి.. ష్యూరిటీలు సమర్పించారు. కోర్టు తీర్పు ప్రకారం.. యాభై వేల రూపాయల డిపాజిట్ తో పాటు రెండు పూచీకత్తులను సమర్పించారు.
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం…
అల్లు అర్జున్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పూచీకత్తు బాండ్ తీసుకుని అల్లు అర్జున్ ను విడుదల చేయాలని చంచల్గూడా జైల్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కు 14 రోజుల…