సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు..