నరేశ్ కు మే నెల బాగా కలిసొచ్చింది. అతని తొలి చిత్రం 'అల్లరి' అనే నెలలో విడుదల కాగా, తాజా చిత్రం 'ఉగ్రం' సైతం అదే నెలలో వస్తోంది. ఈ రెండింటి మధ్యలో "కితకితలు, సీమటపాకాయ్, మహర్షి'' వంటి సినిమాలు నరేశ్ కు మంచి విజయాన్ని అందించాయి.
‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిన నరేష్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘అల్లరి’ సినిమా విడుదలై మే 10వ తేదీకి ఇరవై సంవత్సరాలు అవుతోంది. హీరోగా నరేష్ కు, దర్శకునిగా రవిబాబుకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ‘అల్లరి’ చిత్రం 2002 మే 10న విడుదలయింది. ‘అల్లరి’ చిత్రం కథ ఏమిటంటే – రవి, అపర్ణ చిన్ననాటి స్�