దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు కారణంగా గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 85, 372 మార్కు క్రాస్ చేయగా.. నిఫ్టీ 26, 200 మార్కు క్రాస్ చేసి ఆల్‌టైమ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి.