ఆరో దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీహార్‌లోని ఎనిమిది స్థానాలకు శనివారం ఏకకాలంలో పోలింగ్ జరగనుంది. వీటిలో కొన్ని సీట్లు నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. ఈ క్రమంలో నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచారు. 60 వేల మందికి పైగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో పాటు ఎన్నికల విధులకు 18 వేల మందికి పైగా హోంగార్డులను కూడా నియమించారు. చాప్రాలో ఎన్నికల హింసాకాండ అనంతరం మహారాజ్‌గంజ్‌లో ప్రత్యేక నిఘా ఉంచారు.