'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని తెలిసినా.. చిన్నా పెద్దా తేడా లేదు మందు తాగేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే మద్యానికి అడిక్ట్ అయిన కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ను పట్టించుకోకుండా.. ఒకట్రెండు పెగ్గులేగా ఏం కాదులే అనుకుంటారు. కానీ.. ఇటీవల మద్యంపై డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక విడుదల చేసింది.