అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన కాప్ యాక్షన్ డ్రామా ‘సూర్యవంశీ’ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయడం మొదలు పెట్టింది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ళుగా అక్షయ్ అభిమానులను ఊరిస్తూ వచ్చిన ఈ సినిమాకు నవంబర్ 5న మోక్షం లభించింది. దాంతో థియేటర్లలో ఫ్యాన్స్ వేసే విజిల్స్, ముందు రోజు దీపావళి టపాసుల చప్పుళ్ళను తలపించేలా ఉన్నాయి. మరి ‘సింగం’, ‘సింబా’ తర్వాత జనం ముందుకు వచ్చిన ఈ తాజా ఖాకీ హీరో ఏం చేశాడో…