జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుసగా ఉగ్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి ఆర్మీవాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో కనీసం ఒక ఉగ్రవాది హతమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదులతో భద్రతా బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి.