రక్షణ రంగంలో ఉత్పత్తుల తయారీలో భారత్‌ను స్వయం సమృద్ధిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీన్లో భాగంగానే సుమారు ఐదు లక్షల ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లో ఈ ఆధునిక తుపాకులను తయారు చేయనున్నారు. 7.62 X 39mm క్యాలిబర్ కలిగిన ఏకే 203 రైఫిళ్లను.. ఇన్సాన్ రైఫిళ్ల స్థానంలో వాడనున్నారు. ఇన్సాన్ రైఫిళ్లను ఇండియాలో గత మూడు దశాబ్దాల నుంచి వాడుతున్నారు. ఏకే-203…