(సెప్టెంబర్ 21న బిపాసా తొలి చిత్రం ‘అజ్ నబీ’కి 20 ఏళ్ళు) దర్శకద్వయం అబ్బాస్-ముస్తాన్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దిట్ట అనిపించుకున్నారు. యాక్షన్ మిళితం చేసి తమ కథలను రంజింపచేయడంలోనూ అబ్బాస్- ముస్తాన్ సఫలీకృతులయ్యారు. అక్షయ్ కుమార్ ను ‘ఖిలాడీ’గా జనం ముందు నిలిపినా, షారుఖ్ ఖాన్ ను నెగటివ్ రోల్ లో ‘బాజీగర్’గా తెరకెక్కించినా వారికే చెల్లింది. ఇక బాబీ డియోల్ ను ‘సోల్జర్’గా రూపొందించిందీ వాళ్ళే. 2001లో అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ నబీ’…