కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంతార చాప్టర్ -1’. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకి ఇది ప్రీక్వెల్‌గా రాబోతుండటంతోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్, కొద్ది రోజుల క్రితం కథానాయిక రుక్మిణి వసంత్ పాత్రను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాత్రం మరో ఆసక్తికరమైన పాత్రను…