సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ ఘటనలు ఎక్కువై పోతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించుకునేందుకు కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కుతూ అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నకిలీ పోలీసు అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్ళు గురుగ్రామ్‌లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్‌గా అరెస్టు చేశారు. ఆమె బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్‌ను మనీలాండరింగ్ కోసం ఉపయోగించావని బెదిరించారు. ఆమె ఖాతాలను తనిఖీ చేసే పేరుతో నిందితులు రూ. 78,89,000 బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి…