Flight Delay : హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరుపతి విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన విమానం టేక్ ఆఫ్‌కు ముందు అనుకోకుండా ఆగిపోవడంతో, తిరుమల దర్శనం కోసం వెళ్లే భక్తులు తీవ్రంగా నిరాశ చెందారు. విమాన సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే, అధికారులు టేక్ ఆఫ్‌ను నిలిపివేశారు. అయితే, దీనిపై ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో, వారు…