దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డీజిల్‌తో నడిచే వాణిజ్య వాహనాలు, ట్రక్కులు నిషేధించబడ్డాయి. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450కి పడపోవడంతో వాహనాలను నిషేధించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది. ఢిల్లీలో ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత నానాటికి క్షీణిస్తుంది. గత 4 రోజులుగా గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-AQI) 300 పైనే ఉండడం గమనార్హం.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం గుబులు రేపుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 352గా నమోదైంది. అలాగే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. అయితే దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత సూచీ మరింత దిగజారే అవకాశముందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా…