Hoax bomb threat: గత మూడు రోజులుగా భారతీయ విమానసంస్థలు నకిలీ బాంబు బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాయి. సోమవారం నుంచి ఈ రోజు బుధవారం వరకు మొత్తం 12 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి, ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాస విమానానికి బాంబు ఉందంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. మంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిరిండియా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాలోని ఓ…