సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కోటి విలువైన బంగారంతో పట్టుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం తెలిపింది. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గ్రీన్ ఛానల్‌ను దాటడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అడ్డగించారు. అతని మోకాలి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై విమానాశ్రయంలో ఏకంగా ‘ వీడొక్కడే ’ సినిమా సీన్ రిపీట్ అయింది. సినిమాలో డ్రగ్స్ ను క్యాప్సుల్స్ లో పెట్టి కడుపులో దాచిన సన్నివేశం ఉంటుంది. సరిగ్గా అలాగే టాాంజానియా నుంచి వస్తున్న వ్యక్తి కడుపులో రూ. 8.86 కోట్ల విలువైన 1.266 కిలోల హెరాయిన్ కనుగొన్నారు. మొత్తం 86 క్యాప్సుళ్లను కడుపులో దాచాడు. చెన్నై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా కడుపులో ఉన్న డ్రగ్స్ గుట్టు తెలిసింది.