ప్రధాని మోడీ అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలికి చేరుకున్నారు. సంఘటనాస్థలిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు.. మృతుల గురించి వాకబు చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్చనున్నారు.
గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం (ఏఐ171) కుప్పకూలడంతో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చగా.. ఇద్దరు మాత్రం తృటిలో…
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఏఐ171 విమానం గురువారం (జూన్ 12) ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 265కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో…
ప్రధాని మోడీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని మోడీ పరామర్శించనున్నారు. అనంతరం మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు.
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కి రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలు పరిశోధించే ‘‘ ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB) ఈ ప్రమాద దర్యాప్తులో పాల్గొనబోతోంది. భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు మద్దతు ఇవ్వడానికి ఈ బృందాన్ని పంపిస్తున్నట్లు యూకే చెప్పింది.
లిఫ్ట్ అనేది విమానం రెక్కల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి. ఇది విమానం పైకి వెళ్లేందుకు సహాయపడుతుంది. బరువు అనేది గురుత్వాకర్షణ శక్తి ద్వారా కిందకు లాగబడుతుంది. ఇక థ్రస్ట్ విమానం ఇంజన్ల ద్వారా వస్తుంది. డ్రాగ్ అనేది విమానం గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదుర్కునే నిరోధకత. విమానం గాలిలోకి ఎగరాలంటే బరువు కన్నా లిఫ్ట్ అధికంగా ఉండాలి. డ్రాగ్ కన్నా థ్రస్ట్ అధికంగా ఉండాలి.
Ahmedabad plane crash: ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని ఘోర విమాన ప్రమాదం అహ్మదాబాద్‌లో సంభవించింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది.
Vijay Rupani: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. నిమిషాల్లోనే కాలి బూదదైంది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్లు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం 242 మంది…
ప్రపంచమంతా విచారంలో మునిగిపోయింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు విమానంలో ప్రయాణించిన వారంతా చనిపోయారని సమాచారం వినిపిస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల్లో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 230 మంది మృతుల్లో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా…