Black Box: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. లండన్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. వేగంగా నేలను ఢీకొట్టడంతో విమానంలో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. అయితే, ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.