Black Box: కీలకంగా మారనున్న ‘‘బ్లాక్ బాక్స్’’.. విమాన ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం..
- కీలకంగా మారనున్న బ్లాక్ బాక్స్..
- ఎయిరిండియా ప్రమాద కారణాలు తెలిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black Box: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. లండన్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. వేగంగా నేలను ఢీకొట్టడంతో విమానంలో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. అయితే, ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.
ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. విమానంలో కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికితే కారణాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read
బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..?
బ్లాక్ బాక్స్ అనేది విమాన పనితీరు, పైలట్ల మధ్య సంభాషణలను రికార్డ్ చేసే ఒక పరికరం. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ రెండు భాగాలను బ్లాక్ బాక్స్‌గా పరిగణిస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ఎంత ఎత్తులో ఉంది..? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది..?, ఫ్లైట్ కంట్రోల్స్ పనితీరును రికార్డ్ చేస్తుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఎత్తు, వేగం, ఇంజిన్ థ్రస్ట్, ఫ్లైట్ పాత్ డేటాతో సహా కీలకమైన టెక్నికల్ పెరామీటర్స్‌ని నమోదు చేస్తుంది. ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ల మధ్య సంభాషణలు, ఏటీసీ నుంచి వచ్చే ఆదేశాలు వంటి వాటిని సేకరిస్తుంది.
బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం సులువు అవుతుంది. సహజంగా బ్లాక్ బాక్సులు అత్యంత దృఢంగా ఉంటాయి. ఎలాంటి ప్రమాదానైనా తట్టుకుంటాయి. ప్రకాశవంతమైన నారింజ కలర్‌లో ఉండే ఈ బాక్స్ పేలుళ్లు, మంటలు, నీటి పీడనాన్ని, హై స్పీడ్ క్రాష్ లను తట్టుకుంటుంది. 25 గంటల సమాచారాన్ని నిల్వ చేస్తుంది.
తాజావార్తలు
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!