Air India Express: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ప్రమాదం తర్వాత కూడా దేశీయ విమానయాన సంస్థలు తీరు మార్చుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో అత్యంత వేడి వాతావరణంలో, ఏసీలు లేకుండా విమానంలో కూర్చోపెట్టారని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విమానంలో ఉక్కపోతలో 5 గంటలు నరకం అనుభవించామని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.