చైనా టెక్నాలజీలో దూసుకెళ్తోంది. వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ కోసం రోబోటిక్ పోలీసులను రంగంలోకి దించింది. చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లోని వుహు నగరంలో రద్దీగా ఉండే కూడలిలో రోబో పోలీసులు ఆన్ డ్యూటీలో ఉన్నారు. సైక్లిస్టులు ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలు లేని లేన్‌లో తమ సైకిళ్లను నడపమని సలహా ఇస్తారు. ఈ సలహా ఏ ట్రాఫిక్ పోలీసులూ ఇవ్వలేదు, కానీ హ్యూమనాయిడ్ రోబోట్ ఇచ్చింది. పోలీసు యూనిఫాం, రిఫ్లెక్టివ్ జాకెట్, తెల్లటి టోపీ…