సంపూర్ణ ఆరోగ్యం కోసం నిద్ర చాలా ముఖ్యం. నిద్ర అలసటను దూరం చేస్తుంది. రోజుకు 8 గంటల నిద్రను వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఒక రాత్రి నిద్ర మన ఆరోగ్యం గురించి రాబోయే చాలా సంవత్సరాల వరకు సమాచారాన్ని అందించగలదని వెల్లడైంది. గుండె జబ్బులు, స్ట్రోక్, చిత్తవైకల్యం (జ్ఞాపకశక్తి వ్యాధి), మూత్రపిండాల వైఫల్యం, మరణ ప్రమాదాన్ని కూడా స్లీప్ ప్యాటర్స్న్ నుండి అంచనా వేయవచ్చు. ఈ పరిశోధన నేచర్…