Indian Army Day 2026: ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైన్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 1949లో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప భారత సైన్యానికి తొలి భారతీయ సర్వాధికారిగా బాధ్యతలు స్వీకరించిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఈ రోజున ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం తన రక్షణ వ్యవస్థపై సంపూర్ణ నియంత్రణ సాధించిన సంకేతంగా ఈ రోజు నిలిచింది.