2013లో విడుదలైన రొమాంటిక్ డ్రామా చిత్రం “రాంఝానా” AI సాయంతో మార్చిన కొత్త క్లైమాక్స్‌తో రీ రిలీజ్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సినిమా తమిళంలో “అంబికాపతి” పేరుతో ఆగస్టు 1, 2025న రీ-రిలీజ్ అయింది. సినిమా హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఈ ఏఐతో క్లైమాక్స్ మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ తాజాగా…