అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న బ్యూరో చీఫ్ జీవీజీ యుగంధర్‌కు ముప్పు పొంచి ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమాచారం అందించాయి.
ప్రయాణికుల భద్రతే భద్రతే మాకు ప్రథమ కర్తవ్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ పేరుతో తమ వినియోగదారులకు లేఖ రాశారు. ఇందులో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై స్పందించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని.. కింద భవనంలో ఉన్న 34 మంది పౌరులూ ప్రమాదంలో మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు.