భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని రక్షణ వ్యవస్థ పరీక్షించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కదిలే రైలు నుంచి క్షిపణి ప్రయోగాన్ని భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైలు నుంచి అగ్ని-ప్రైమ్ గర్జిస్తోందని పేర్కొన్నారు.
Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్‌ను తొలిసారిగా పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) బుధవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా పరీక్షించింది. గురువారం డీఆర్డీఓ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మిస్సైల్ నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
క్షిపణి ప్రయోగాల్లో భారత్ దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ ఇవాళ 09.45గంటలకు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు.