Today (27-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో క్రిస్మస్ మరుసటి రోజు నుంచి.. అంటే.. గడచిన రెండు రోజులుగా లాభాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్‌ను శాంతాక్లాజ్ ర్యాలీగా పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్ నుంచి కూడా ఇవాళ సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. చైనాలో సైతం కొవిడ్ సంబంధిత ఆంక్షలను మరింతగా సడలిస్తున్నట్లు ప్రకటించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు బూస్ట్‌లా పనిచేసింది. దీంతో రెండు సూచీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గ్రోత్ నమోదు చేశాయి.