US-India: ఇరాన్ వ్యూహాత్మక ఓడరేపు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్‌ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం ఇండియాను ఇబ్బంది పెట్టేదిగా ఉంది.