దేశంలో ప్రముఖ రైడ్-హైలింగ్ సర్వీసులలో ఒకటైన ఓలా క్యాబ్స్ కీలక మార్పులు చేసింది. మంగళవారం నుంచి నాన్–ఏసీ రైడ్స్‌ను అధికారికంగా ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా ఈ సేవను అందిస్తున్న సంస్థగా ఓలా కంపెనీ గుర్తింపు పొందింది. ఈ కొత్త ఎంపికతో కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు లభిస్తాయని, ఇది వినియోగదారుల పట్ల తమ నిబద్ధతను ప్రతిబింబించే నిర్ణయమని యాజమాన్యం తెలిపింది. కంపెనీ ప్రతినిధుల వివరాల ప్రకారం, అర్బన్ ప్రాంతాల్లో నాన్–ఏసీ రైడ్స్ చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి.…