విజయవాడ తూర్పు నియోజకర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 ఏళ్లు.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోన్నర ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచారు.. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్‌తో ఫోన్‌లో మాట్లాడి.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.