కొన్నిసార్లు మనం లోతైన ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు లేదా ఆందోళన, భయంతో చుట్టుముట్టబడినప్పుడు.. మన హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా మందికి సంభవిస్తుంది. సాధారణంగా ఓ వ్యక్తి హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ (BPM) ఉంటుంది. కానీ హృదయ స్పందన రేటు 100 BPM కంటే ఎక్కువగా ఉంటే.. దానిని 'టాచీకార్డియా' అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఏదైనా వ్యాధికి సంకేతమా? అనే విషయాలను తెలుసుకుందాం..