కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం నాడు పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో రూ.110 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులను చారిత్రాత్మక ఘటనగా సీఎం జగన్ అభివర్ణించారు. పులివెందులకు మంచి కంపెనీ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల ఉద్యోగాలు లభిస్తాయని…