ప్రస్తుతం వరి కొనుగోలుకి ఇబ్బందులు పడుతున్న వేళ రైతులు వరి పంటకు బదులు ఆయిల్ పాం పంట సాగు వైపు దృష్టి సారిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చు. నిత్యం సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే ఆయిల్ పాం సాగు చేయడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరం తర విద్యుత్ సరఫరా వల్ల ఈ సదుపాయాన్ని రైతాంగం వినియోగించుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఆయిల్ పాం పంట సాగు చేసే రైతుల కోసం ఫ్యాక్టరీ నిర్వాహకుల…