మహారాష్ట్రలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన (ఏక్‌నాథ్ షిండే) మహాయతి కూటమి ఘన విజయం సాధించడంతో బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ $3 బిలియన్ల ధారావి ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది. దీని కింద ముంబైలోని మురికివాడ ధారవిని 'ప్రపంచ స్థాయి' జిల్లాగా పునరాభివృద్ధి పనులు షురూ అవుతాయని వార్తలు వస్తున్నాయి.