ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అదా శర్మ. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. నటన పరంగా మంచి మార్కులు కోటేసినప్పటికి ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, ఆమె అవకాశాల కోసం సెకండ్ హీరోయిన్ పాత్రల వైపు మళ్ళింది. అలా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది..…