సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ నటి, మోడల్ నేహాశర్మ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం మహాకూటమిలో సీట్లపై పోరు కొనసాగుతున్న తరుణంలో బీహార్‌లోని భాగల్‌పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ తన వాదన వినిపించారు.