మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకీ ఎన్నడూ లేనంతగా చర్చలకు తెరలేపుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం వున్నా అప్పుడే ‘మా’లో రచ్చ మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. అయితే తాజాగా సీనియర్ నటుడు సుమన్ ‘మా’ ఎన్నికల వ్యవహారంపై స్పందించారు. లోకల్-నాన్‌లోకల్ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. ఆ భావననే వైద్యులకు, రైతులకు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండంటూ కోరారు.…