Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ ఇటీవల తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించడంపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకుంది. కమల్ హాసన్ సినిమాను రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి.
Kamal Haasan: భాషాభిమానానికి కర్ణాటక, తమిళనాడు పెట్టింది పేరు. అలాంటి చోట భాష గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. కానీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఆయన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు.
కేంద్రంపై నటుడు కమల్‌హాసన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చి.. బీజేపీ గెలవాలనుకుంటోందని కమల్ హాసన్ ఆరోపించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలను బలవంతంగా హిందీ భాషగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
నటుడు కమల్ హాసన్ డిసెంబర్ 24న జరగనున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు వచ్చే వారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో చేరనున్నారు. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ప్రకారం సూపర్ స్టార్‌ను యాత్రలో పాల్గొనమని రాహుల్ గాంధీ ఆహ్వానించారు.